సూక్తులు (ఏవో నాకు నచ్చిన నాలుగు మంచి మాటలు)

వేద పురాణాల్లో ప్రభోధించిన.... మహర్షులు ప్రవచించిన..... సూక్తులు... ధృడమైన విశ్వాసం లేకపోతేభగవంతుడు ఏ సహాయం చేయలేడు.

Thursday, August 30, 2018


బియ్యపు గింజను ఎసరులో కలిపితే అన్నం అవుతుంది
అదే బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు అవుతాయి
మనిషి కూడా అంతే.............
మనం నలుగురితో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత ఆధారపడి ఉంటుంది

Friday, June 1, 2012

ఉదయం మేలుకోవాల్సిన సమయం ఏది?

శ్లో|| బ్రాహ్మే ముహూర్తే బుధ్యేత,
ధర్మార్థౌ చాను చింతయేత్,
కాయక్లేశాంశ్చ తన్మూలాన్,
వేద తత్వార్థ మేవ చ. -మను.4-92

సూర్యోదయాత్పూర్వమే (బ్రహ్మముహూర్తము-
సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు)
మేలుకొని, ధర్మార్దములకు తగిన మార్గములు,
వాటి సాధనకు గల శరీరశ్రమాదులు నిశ్చయించుకోవాలి